Monday, December 23, 2024

లౌడ్‌స్పీకర్లలో హనుమాన్ చాలీసా: పోలీసుల అదుపులో నలుగురు

- Advertisement -
- Advertisement -

Hanuman Chalisa among loudspeakers: For in police custody

ముంబై : శివసేన ప్రధాన కార్యాలయం వద్ద లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాను వినిపించిన నలుగురు మహారాష్ట్ర నవ నిర్మాన్ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలను పోలీసులు ఆదివారం అదుపు లోకి తీసుకున్నారు. లౌడ్‌స్పీకర్‌ను, క్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుసుకున్న ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ సమీపం లోని ఓ గుడిలో హనుమాన్ చాలీసా వివరించారు. మసీదులపై లౌడ్‌స్పీకర్ల నుంచి పెద్ద శబ్దం వస్తుండటంతో రోగులు, బాలలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ పరిస్థితిని నివారించాలని ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాకరే ఏప్రిల్ 2 న డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే తాము మసీదుల వద్ద హనుమాన్ చాలీసా పెద్ద శబ్దంతో వినిపిస్తామని హెచ్చరించారు. ఆదివారం పోలీసులు అదుపు లోకి తీసుకున్నవారిలో ఎంఎన్‌ఎస్ నేత యశ్వంత్ కిల్లేదార్ కూడా ఉన్నారు.

చచ్చిన పార్టీని బతికించేందుకే ఎంఎన్‌ఎస్ యత్నం : ఆదిత్యఠాక్రే

చచ్చిన పార్టీని బతికించేందుకే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్ ) యత్నిస్తోందని శివసేన నేత , మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ముంబై లోని శివసేన ప్రధాన కార్యాలయం వద్ద ఎంఎన్‌ఎస్ నేత హనుమాన్ చాలీసాను మైక్‌లో వినిపించడంపై ఆయన ఈమేరకు స్పందించారు. తమ పార్టీ హిందుత్వం గురించి అందరికీ తెలిసిందేనని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎస్ , బీజేపీపై శివసేన మండిపడింది. బీజెపి ఉద్దేశపూర్వకంగా ఎంఎన్‌ఎస్‌ను రెచ్చగొడుతోందని ,ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News