Monday, December 23, 2024

జైశ్రీరామ్ అంటూ గుండెపోటుతో కుప్పకూలిన హనుమంతుడు… (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రామనామంతో మార్మోగిపోయింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. దేశం వ్యాప్తంగా రాయాలయాల్లో పూజలు, యాగాలు, యజ్ఞాలు నిర్వహించారు. హర్యానా రాష్ట్రి భివానీలో రామ్‌లీలా కార్యక్రమం విషాదంగా ముగిసింది. రామ్‌లీలా కార్యక్రమం జరుగుతుండగా హనుమంతుడి వేషధారణలో ఉన్న హరీష్ మెహతా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన నటిస్తున్నారని అందరూ చప్పట్లు కొడుతున్నారు. అదే సమయంలో రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తి అతడి దగ్గరికి వెళ్లి చూసేసరికి కింద పడి ఉన్నాడు. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని తెలపడంతో నిర్వహకులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెపోటుతో చనిపోయి ఉంటాడని వైద్యులు వెల్లడించారు. మృతుడు హరీష్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. గత 25 సంవత్సరాల నుంచి ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News