Sunday, December 22, 2024

హనుమాన్ జయంతి వేడుకల్లో సందడి చేసిన మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్, శ్రీరాంనగర్, ఉదయ్ నగర్, యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణా నగర్ సందర్శించి పూజలు నిర్వహించారు. కృష్ణ నగర్‌లోని భాగ్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న మేయర్ అనంతరం హనుమాన్ భక్తుల అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

ఆలయ ధర్మకర్తలు నగర మేయర్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ హనుమాన్ జయంతిని భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాముడుకి గొప్ప భక్తుడైన హనుమంతుడు విష్ణువు అవతారమని, బలం, శక్తికి చిహ్నమైన ఆయన అచంచలమైన భక్తికి విస్తృతంగా ప్రసిద్దికేక్కరాని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News