- Advertisement -
హైదరాబాద్: నగరంలో మంగళవారం శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర(ర్యాలీ) గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలయింది. ఈ ర్యాలీ బోవెన్ పల్లి హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 13 కిమీ. పయనించనున్నది. మార్గమధ్యంలో సికింద్రాబాద్ ను కూడా దాటగలదు. ఈ ర్యాలీని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్ నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించారు.
ఆర్టిసీ క్రాస్ రోడ్డు వద్ద ముషీరాబాద్ కు వెళ్లే దారిలో పోలీసులు బారీకేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరో పెద్ద ర్యాలీ కార్మాన్ ఘాట్ నుంచి సైదాబాద్ గుండా వెళ్లి కో్ఠి ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రధాన ర్యాలీలో కలిసిపోయి సికింద్రాబాద్ లోని బోయినపల్లి వైపుకు వెళ్లనున్నది. ర్యాలీ వెళ్లే దారిలో ట్రిఫిక్ ఆంక్షలను విధించారు.
- Advertisement -