Friday, November 15, 2024

తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరుండదు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister harish participant hanuman jayanti celebrations

 

మేడ్చల్: జిల్లాలోని కండ్లకోయలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ దీక్ష మాల రూపకర్త దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో వేడులు నిర్వహించారు. హనుమాన్ మాల విరమణకు దీక్షా స్వాములు వేలాదిగా తరలివచ్చారు. దీక్షా స్వాములతో దుర్గాప్రసాద్ స్వామి మాల విరమన చేయించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, మెదక్ ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ఇవాళ అత్యంత పవిత్రమైన రోజు అన్నారు. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరుండదని మంత్రి స్పష్టం చేశారు. హనుమంతుని జీవితం ఆదర్శప్రాయం కావాలన్నారు. శ్రీరాములు,హనుమంతుడు ఓ మతానికో, పార్టీకో చెందిన వారు కాదని హరీశ్ రావు వెల్లడించారు. దుర్గాప్రసాద్ స్వామి సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించారని వివరించారు. దుర్గాప్రసాద్ స్వామి తెలంగాణలో వందలాది ఆలయాలను పునర్నిర్మించారని హరీశ్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News