Monday, January 20, 2025

హనుమన్ జయంతి స్పెషల్ పోస్టర్

- Advertisement -
- Advertisement -

తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’తో వస్తున్నాడు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఆదివారం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ఆశిష్ హనుమంతుని విగ్రహం ముందు నమస్కరించి చేతులు చాచాడు. ఇందులో అతను సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆశిష్ సరసన ఇవానా కథానాయికగా నటిస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఫస్ట్ సింగల్ దిల్ ఖుష్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News