Friday, December 27, 2024

14 నుండి 18 వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తిరుమలలో ఈ నెల 14 నుంచి 18వ వరకు జరగనున్న హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం ఆ తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజు అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్‌డిపిపి ప్రాజెక్టుల కళాకారుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేదపండితులతో కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీ బీసీ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్విబిసి సిఈవో షణ్ముఖ్‌కుమార్, వేద వర్సిటీ విసి ఆచార్య రాణిసదాశివమూర్తి, సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య కృష్ణమూర్తి, హెచ్‌డిపిపి సెక్రటరీ శ్రీనివాసులు, హిందు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్‌విభీషణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News