Monday, January 20, 2025

‘హను-మాన్’ సెన్సేషన్.. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు..

- Advertisement -
- Advertisement -

యువ కథానాయకుడు తేజ సజ్జ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన క్రేజీ చిత్రం ‘హను-మాన్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి స్పెషల్ గా ఈనెల 11న ప్రీమియర్స్ బ్లాక్‌బస్టర్స్ టాక్‌తో విడుదలైన ఈ చిత్రం అదే జోరును కొనసాగిస్తోంది.

ఈ చిన్న సినిమా స్టార్ హీరో సినిమాలా అద్భుతాలు చేస్తూ రోజురోజుకు భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం నిజానికి అన్ని చోట్లా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది.ఈ స్మాల్ స్కేల్ బడ్జెట్ సినిమా కు ఇది భారీ విజయం అనే చెప్పాలి. ‘హను-మాన్’ సినిమా ఓవర్సీస్‌లో 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి అక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News