Thursday, January 9, 2025

సంక్రాంతి కానుకగా…

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండి యా చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మాసీవ్ సిజిఐ వర్క్ ఉండ టం వల్ల జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన విఎఫ్‌ఎక్స్ వర్క్‌పై నిపుణుల బృందం పని చేస్తోంది.

మేకర్స్ రాజీపడకుండా రూపొందిస్తున్నారు. విడుదల తేదీ పోస్టర్‌లో హీరో తేజ సజ్జ చేతిలో హనుమాన్ జెండాతో ఒక కొండపై నుండి మరొక కొండకు దూకడం కనిపిస్తుంది. ఇది హనుమంతుని ఆశీర్వాదంతో సూపర్ పవర్స్ ని కలిగిన అండర్‌డాగ్ ని చూపుతుంది. హను-మాన్ చిత్రం తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయా ళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News