Wednesday, January 22, 2025

పవర్‌ఫుల్ పాత్రలో…

- Advertisement -
- Advertisement -

 

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి పాన్- ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హాను-మాన్’తో వస్తున్నారు. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ అంజమ్మగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వరలక్ష్మి వధువు వేషంలో చేతిలో కొబ్బరికాయల గుత్తితో కనిపిస్తుంది. అందంతో పాటు కరకుగా కనిపిస్తుంది. పోస్టర్‌ని బట్టి చూస్తే ఈ సినిమాలో వరలక్ష్మి పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తోందని తెలుస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News