Friday, November 22, 2024

మళ్లీ బిజెపి వస్తే…. దేశం ముక్కలు కావడం ఖాయం: విహెచ్

- Advertisement -
- Advertisement -

Hanumantha rao comments on BJP

హైదరాబాద్: బిజెపి అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్త మీద చేసిన కామెంట్స్ వివాదమయ్యాయని మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేయాలని బిజెపి చూస్తుందని, బిజెపి నేతలు రోజు కొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ మసీదులను తవ్వాలంటారని, కర్నాటకలో ఈశ్వరప్ప జాతీయ జెండాను మారుస్తామంటారని,  బిజెపి నేతల జాగీరా? అని ప్రశ్నించారు. ఇతర మతాల వారిని కించ పరచడమేనా? బిజెపి ఏజెండా అని కడిగిపారేశారు.

 గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి పరిస్థితి ఏంటి? అని. గల్ఫ్ నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నామని ఇవ్వం అంటే పరిస్థితి? ఏంటని ప్రశ్నించారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన వారిని జైల్లో పెట్టాలన్నారు. హిందూ- ముస్లిం మధ్య చిచ్చు పెట్టి ప్రపంచ దేశాల ముందు భారత దేశాన్ని చులకన చేస్తున్నారని విహెచ్ దుయ్యబట్టారు. బిజెపికి మూడోసారి అవకాశం ఇస్తే, దేశం ముక్కలు అవడం ఖాయమన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు జోడో భారత్ యాత్ర చేపడుతోందని, రేప్ చేసే వారిని మరణశిక్ష విధిస్తే, ఇలాంటి కేసులు తగ్గిపోతాయన్నారు. న్యాయస్థానం త్వరతగతిన నిర్ణయాలు తీసుకుంటే నేరాలు తగ్గుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News