Thursday, January 23, 2025

మోడీ 8 ఏళ్లలో ఒక్క పని చేయలేదు: విహెచ్

- Advertisement -
- Advertisement -

V Hanumantha Rao Fire on NJP Leaders

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్లలో ఒక్క పని చేయలేదని మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం విహెచ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారని విరుచుకపడ్డారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ఎప్పుడైనా ధరల గురించి ఆలోచించావా? అని ప్రశ్నించారు. నూపుర్ శర్మ, రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని హనుమంతరావు చురకలంటించారు.

సెప్టెంబర్ 4న పెరిగిన ధరల మీద కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, తాను కూడా స్వయంగా పాల్గొంటానని, ధరలపై ప్రజల దృష్టిని మరల్చడానికి మత గొడవలు సృష్టిస్తున్నారని బిజెపిపై మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి ముందుకు వెళ్తామని, పార్టీకి పూర్వవైభవం రావాలంటే అందరం కలిసి పని చేయాలని సూచించారు. బట్టలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు. ఎంఎ ఖాన్ కి కాంగ్రెస్ ఎం తక్కువ చేసిందని అడిగారు. బండి సంజయ్ నాలుగు ఇండ్లు తిరిగి పరిస్థితి అడిగి తెలుసుకోవాలన్నారు. పార్టీకి కష్టకాలంలో ఉందని, అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News