Thursday, January 23, 2025

బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా హనుమంతు ముదిరాజ్

- Advertisement -
- Advertisement -

నియమాక పత్రాన్ని అందచేసిన బిసి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా హనుముంతు ముదిరాజ్ నియమితులయ్యారు. ఆదివారం జరిగిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఈ మేరకు హనుమంతు ముదిరాజ్‌కు నియమాక పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని, బిసిల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. బిసి  రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడమే కాకుండా, వారి ఐక్యతకు కృషి చేస్తామన్నారు. తనపై ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చిన బిసి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షునికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్( టిజెఎంయు ) రాష్ట్ర కార్యదర్శిగా ఆర్‌టిసి సమస్యలపై నిత్యం పలు ఆందోళనలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్‌టిసి కార్మికుల సమస్యలను ఇటు యాజమాన్యం దృష్టికి, అటు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ వాటి  పరిష్కారం కోసం హనముంతు ముదిరాజ్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News