Sunday, November 24, 2024

4 ఏళ్ల బాలికకు కొత్త జీవితాన్నిచ్చిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) హైదరాబాద్ 4 ఏళ్ల బాలికకు, హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా విజయవంతంగా చికిత్స చేసింది. దీపికా అనే యువ రోగి చిగుళ్ళలో రక్తస్రావం, తరచుగా ముక్కులో నుంచి రక్తం కారటం(ఎపిస్టాక్సిస్) కారణంగా వైద్య సహాయం కోరుతూహాస్పిటల్ కు వచ్చింది.

ఆమె ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తక్కువగా ఉండటం (థ్రోంబోసైటోపెనియా) వల్ల ఆమె పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆమె ప్లేట్‌లెట్ కౌంట్ 3000 స్థాయికి చేరుకుంది. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా అనుమానంతో, AOIలోని హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ అశోక్ కుమార్ స్టెరాయిడ్‌లతో చికిత్స ప్రారంభించారు. తదుపరి పరిశోధనలో, ఆమెకు పుట్టుకతో వచ్చే అరుదైన రుగ్మత అమెగా కార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా ఉన్నట్లు బయట పడింది. ఈ స్థితిలో ఎముక మజ్జ తగినంతగ ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేయడంలో విఫలమవుతుంది.

డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ… “కాంజేన్షియల్ అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా (CAMT) అనేది అరుదైన, వారసత్వంగా వచ్చే రుగ్మత. దీపిక కేసు యువ రోగుల అసాధారణ స్థిరత్వం, అధునాతన వైద్య జోక్యాల శక్తికి ఉదాహరణగా నిలుస్తుంది” అని అన్నారు. కేసు సంక్లిష్టత దృష్ట్యా, AOI హైదరాబాద్ నిపుణులు దీపిక తల్లిని దాతగా ఉపయోగించి-హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానాన్ని అనుసరించారు.

చికిత్స కాలంలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నప్పటికీ AOI హైదరాబాద్ నిపుణుల కృషి, ఐదు నెలల వైద్య సంరక్షణ తర్వాత, దీపిక అద్భుతమైన పురోగతిని సాధించింది. ఆమె ప్లేట్‌లెట్ కౌంట్ 100,000 దాటింది. ఆమె ఆరోగ్యం స్థిరీకరించబడినందున, ఆమె మందులు జాగ్రత్తగా తగ్గించబడ్డాయి. ఆమె ఇప్పుడు ఒకే ఔషధంపై ఆధారపడుతుంది. ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి తన అభిప్రాయాలను తెలియజేస్తూ..”అత్యాధునిక చికిత్సలను స్వీకరించడం ద్వారా, ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News