Monday, January 20, 2025

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -
  • మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: దైవ భక్తికి, త్యాగానికి, సేవ నిరతికి బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం, సేవ అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, అందరి మత విశ్వాసాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ పాలన చేస్తున్నారని అన్నారు. గంగ జమున తహజీబ్ తో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ముఖ్యమంత్రి అభిమతమని అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. అల్లా దయ అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని,బక్రీద్ ను ఘనంగా కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News