Thursday, January 23, 2025

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News