Monday, December 23, 2024

బిసి బంధు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు….

- Advertisement -
- Advertisement -

Happy Birth day to CM KCR

హైదరాబాద్: 70 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో సిఎం కెసిఆర్ లా ఏ నాయకుడు బిసిల కోసం కృషిచేయలేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఘనంగా సిఎం కెసిఆర్ 68వ జన్మధిన వేడుకలు జరిగాయి.  50 అడుగుల సిఎం కెసిఆర్ బారీ కటౌట్ కు గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా టిఆర్ఎస్, కెసిఆర్ అభిమానులు హాజరయ్యారు.  రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతున్న సిఎం కెసిఆర్ పదికాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని గంగుల ఆకాంక్షించారు.  కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం ఉందని,  తెలంగాణ ప్రజలకు వరం సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు.  తెలంగాణలో సిఎం కెసిఆర్ జన్మించడం మన అదృష్టమన్నారు. కెసిఆర్ పుట్టిన గడ్డపై పుట్టడం గర్వకారణంగా ఉందన్నారు.  వేల కోట్ల విలువైన భూములను 41 బిసి కులాల ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన బిసి బంధు సిఎం కెసిఆర్ అని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News