Thursday, January 23, 2025

కెసిఆర్ బర్త్ డే…. ప్రముఖుల శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Happy birth day to CM KCR

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, నటులు చిరంజీవి, మహేష్ బాబు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తదితరులు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు  ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News