- Advertisement -
ఎమ్మెల్సీ కసిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
నాగర్ కర్నూల్: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవ చేయాలని కెసిఆర్ ఆకాంక్షించారు
కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్, ఆమన్గల్, వెల్దండ, కల్వకుర్తి మండలాల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, అభిమానులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి మొక్కలు నాటారు. పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు
- Advertisement -