Wednesday, January 15, 2025

ఆపద్బాంధవుడు అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు: పవన్

- Advertisement -
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులు చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పవన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని, అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు పవన్ తెలియజేశారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తనకు తెలుసునని, అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు కోకొల్లాలు ఉన్నాయని, కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయని ప్రశంసించారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని, అభ్యర్ధిస్తారని, ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో అని పవన్ కొనియాడారు.
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవి ఆశీర్వదించాని తెలిపారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని ఇచ్చిందని పవన్ ప్రశంసించారు. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుడినిగా ఉంటానని చెప్పారు. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నానన్నారు.
Happy birthday to chiranjeevi says by Pawan kalyan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News