Tuesday, January 21, 2025

చుక్కారామయ్యకు ‘జూలూరు’ జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 99వ సంవత్సరంలోకి అడుగిడారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరిశంకర్ సోమవారం ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 99 సంవత్సరాల వయసులో కూడా చుక్కా రామయ్య పదునైన ఆలోచనలతో మాట్లాడుతున్నారని జూలూరు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల తీరు ఎలా నడుస్తోంది? ప్రస్తుత రాజకీయ వాతావరణ విశేషాలేమిటి? ఏ ఏ అంశాలపై ఎన్నికల ఎజెండాలు కొనసాగుతున్నాయి? అన్న విషయాలను చుక్కారామయ్య అడిగి తెలుసుకున్నారు. 99 సంవత్సరాల వయసులో కూడా ఆయన చురుకుగా ఆలోచించడం సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతను, నిమగ్నతను తెలియజేస్తోందని జూలూరు అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News