Saturday, December 21, 2024

అంచెలంచెలుగా ఎదిగి యంగ్ స్టార్‌గా..

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ..ఇవాళ తన సినిమాలను గ్రాండ్‌గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. బుధవారం విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూస్తే… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు.

రిషి క్యారెక్టర్‌లో ఈ కొత్త అబ్బాయి బాగా నటిస్తున్నాడని అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన మాస్టర్ పీస్ అర్జున్ రెడ్డి… విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే..గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆయన మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న వీడీ 12 సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకుంటోంది. గురువారం హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రౌడీ బాయ్ కి తన అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News