Friday, January 10, 2025

రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో ఘనంగా జరుపుకోవాలని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగను మనం జరుపుకుంటామన్నారు. చీకట్లను పారదోలి వెలుగులను ప్రసాదించాలని కోరుకునే పండుగ దీపావళి అని అన్నారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో వెలుగులు రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. అందరి జీవితాలలో వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News