Monday, December 23, 2024

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగు ప్రజలందరికీ హృదయ పూర్వక విజయ దశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకునే విజయదశమి  పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నానని అన్నారు.

పండుగ పూట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన కడిగిన ముత్యంలా బయటకు రావాలని యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ దసరా పండుగ ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ నూతన ఉత్సాహం నింపాలని కోరుకుంటూ,  ప్రజలందరికీ ఈ విజయదశమి నుంచి అన్ని విజయాలు చేకూరాలని కోరుతూ దసర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News