Monday, December 23, 2024

ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: దుగ్గొండి మండలం గిర్నిబావి మహాత్మాజ్యోతిభా గురుకుల బాలుర పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులందరూ అక్షరాస్యులుగా ఎదగడానికి ప్రభుత్వం కల్పించిన ఓపెన్ స్కూల్స్, నైట్ స్కూల్స్, దూర విద్యను ఉపయోగించుకోవాలని, వంద శాతం అక్షరాస్యతను సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీలో ఏటీపీ ప్రభాకర్, డిప్యూటీ వార్డెన్ రాజు, ఉపాధ్యాయులు సుకుమార్, సోమారాణి, సురేష్, సమత, సునీత, అనిత, కోటి, కిరణ్, రమేశ్, కృష్ణమూర్తి, సందీప్‌కుమార్, రమేశ్, బషీర్, లక్ష్మణ్, వీరేందర్, జూనియర్ అసిస్టెంటు బాల కొమురెల్లి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News