Thursday, January 23, 2025

ఘనంగా అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం

- Advertisement -
- Advertisement -

500 మందికి పైగా తరలి వచ్చిన బధిరులు
ప్రేక్షకులను ఆకట్టుకున్న బధిర విద్యార్థుల నృత్య, నాటక ప్రదర్శనలు

మన తెలంగాణ / హైదరాబాద్ : బధిరుల సాధికారత రంగంలో డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్ భారీ ప్రగతిని సాదించడం ఎంతో సంతోషకరమని బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం అన్నారు. అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సహకారంతో డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్, టెక్ – మహీంద్రా ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో సికిందర్‌బాద్‌లోని వైఎంసిఎలో జరిగిన అవగాహన డ్రైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమాజంలో అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్న వారికంటే, బాధిరుల్లో అత్యంత తెలివి తేటలు కలిగి ఉండటం చాలా గొప్ప విషయమని అన్నారు. బాధిరులను చైతన్య పరచడంలో ‘డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్’ సేవలు మరువలేనివని అన్నారు.

ఈ సందర్బంగా ఎడ్యుసైన్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ యాప్ బధిరుల కోసం భారతీయ సంకేత భాషలో అందుబాటులో ఉన్న మొట్టమొదటి అధికారిక విద్యా సహాయ వేదికగా పని చేస్తుందని డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ అవగాహన డ్రైవ్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 500 మందికి పైగా బధిరులు పాల్గొన్నారు. బధిరుల సంస్కృతికి ప్రతీక, భారతీయ సంకేత భాష యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించే నీలం రంగు బెలూన్‌లను ఎగురవేస్తూ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అనంతరం బధిర విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం, నాటక ప్రదర్శన అందరిని ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యూత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్, టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధి సుధీర్ బాబు, పిఎంజే జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జైన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

Day..2

Day..3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News