హైదరాబాద్: ప్రతి ఏటా జూలై 1వ తేదీన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటుంది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా. బిధన్ చంద్రరాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జరుపుకుంటారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలందరికీ ఈరోజు అంకితం. కొవిడ్ మహమ్మారి విస్తరించకుండా ప్రపంచ వ్యా ప్తంగా వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది చేసి కృషి, త్యాగాల గురించి మరోసారి మనకు గుర్తు చేసింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తూ వేలమందిని బలిగొంది. ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు వైద్యులు ఎనలేని కృషి చేశారు.
కరోనా రోగులు ఆసుపత్రులకు వస్తే వారిని ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుం టూ ఎప్పటికప్పడు వారిని కంటి రెప్పలా కాపాడుకుంటూ ల క్షలామందికి ప్రాణం పోశారు. రోగులు ప్రాణాలే ధ్యేయంగా ఆసుపత్రుల్లో ఉంటూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి కూడా రోగుల ప్రాణాలే ముఖ్యమని రాత్రింబళ్లు సే వలందించి ప్రపంచదేశాల ప్రజలను ప్రశంసలు పొందారు. కనిపించే దేవుళ్లు వైద్యులని వారిని ప్రజ లు, సమాజం గౌరవించాలి. అప్పుడే మానవ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఆసుపత్రుల్లో చికిత్స పొం దుతున్న రోగులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రుల్లో రోగులు సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రజాసంఘాలు ఘనంగా సన్మానం చేసేందుకు సిద్ధమైయ్యారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి తరిమికొట్టింది వైద్యులేనని కొనియాడుతున్నారు. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్య సేవలందించిన వైద్యులను ప్రజలు ప్రాణాలు కాపాడే దే వుళ్లకు నిజమైన రూపం వైద్యులేనని ప్రశంసిస్తున్నారు. సెకం డ్ వేవ్‌లో ఎంతోమందిని వైరస్ బారిన పడి కొన ఊపిరితో ఆ సుపత్రులకు వెళ్తే సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసి తమకు ప్రాణం పోసి ఆరోగ్యంగా ఇంటికి పంపించారని కరో నా వైరస్ నుంచి కోలుకున్న రోగులు పేర్కొంటున్నారు.