Wednesday, January 22, 2025

నగరంలో నయాసాల్ జోష్…

- Advertisement -
- Advertisement -

వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్న యువత
పబ్బులు, ప్రత్యేక ఈవెంట్ల ఏర్పాటు

మనతెలంగాణ, సిటిబ్యూరోః  కొత్త సంవత్సర వేడకలను నగర యువత ఘనంగా జరుపుకున్నారు. 2023కు వీడ్కోలు పలికి 2024కు స్వాగతం తెలిపేందుకు యువకులు వివిధ రూపాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. చాలామంది నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లకు వెళ్లారు. అన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో డిస్కౌంట్లు, కపుల్స్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆకర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

దీంతో చాలామంది వేడుకలు చేసుకునేందుకు బయటికి పలు ఈవెంట్లకు క్యూ కట్టారు. మ్యూజిక్, ఆటపాటలతో పలువురు ఎంజాయ్ చేశారు, మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. రాత్రి 12 కాగానే ఒకరికి ఒకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొందరు యువకులు సాయంత్రం కాగానే ఎంజాయ్ చేసేందుకు వివిధ ఈవెంట్లు జరిగే ప్రాంతాలకు వెళ్లిపోయారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేసి ఇళ్లకు చేరుకున్నారు. కొంత మంది నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నగర శివారులోని ఫాం హౌసులకు వెళ్లారు.

అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ ఉల్లాసంగా గడిపారు. పబ్బులు సాధారణంగా రోజు మాదిరిగానే కొత్త సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేసి పలువురిని ఆకర్శించేందుకు ప్రయత్నించాయి. చాలా పబ్బుల్లో యువతను ఆకర్శించేందుకు డిస్కౌంట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News