Monday, December 23, 2024

జిల్లా ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరబాద్ :  ప్రజలకు మంత్రి హరీష్ రావు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, మీ అందరికి మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షిస్తున్న అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2022 లో ఒక వైపు జిల్లా మరో వైపు రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించి, వృద్ధిలో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచిందన్నారు.. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అన్ని రంగాల్లో జిల్లాను , రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేసి, ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంగా పని చేస్తామన్నారు. గత సంవత్సరం లో ఎన్నో ప్రగతి పురోగతి సాదించి జిల్లాను అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలిచిందన్నారు.

మల్లన్న స్వామి దయతో జిల్లా కు మల్లన్న సాగర్ కి గోదావరి జలాలు తెచ్చి జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. అదే స్ఫూర్తితో ఈ నూతన సంవత్సరంలో సిద్దిపేట ప్రాంతానికి రైలు , జాతీయ రహదారి, వెయ్యే పడకల ఆసుపత్రి , యువత కు ఉపాధి కలిపించే ఐటి టవర్ ఇలా ఎన్నో ప్రగతి పనులు మీ ముందు కు తెస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నఅన్నారు.

ముఖ్యంగా విద్యార్థులు,యువత నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వాటిని చేరుకునేలా ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని మంత్రి కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏర్పరుచుకున్న లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి చేరుకునేలా శ్రమించాలని కోరుకున్నారు. 2022 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ,2023 లోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మంత్రి హరీష్ రావు శుభకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News