Wednesday, January 22, 2025

సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  మంత్రి  మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకరావాలని ఆకాంక్షించారు.

సిఎం కెసిఆర్ నాయకత్వం లో ప్రభుత్వం అభివృద్ధి , సంక్షేమ రంగంలో వృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గోదావరి జలాలతో పసిడి పంటలు పండి, సాగు పరిడవిల్లిందన్నారు. రైతుల ఇంటా నిత్యం కొత్త కాంతులు చూడలన్నదే సిఎం కెసిఆర్ , బి ఆర్ ఎస్ పార్టీ లక్ష్యం అని వెల్లడించారు.

భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి అని, కనుమ పండగ కనువిందుగా జరుపుకోవాలని కోరారు. ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అని భగవంతున్నీ కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికి శుభం చేకూరాలని , ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News