Monday, December 23, 2024

సంక్రాంతి శుభాకాంక్షలు : మంత్రి తలసాని శ్రీనివాస్‌

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్ర ప్రజలందరికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉండే సమయమని తెలిపారు. మూడు రోజులపాటు ఆనందంగా జరుపుకునే పండుగ అని, ఆడపడుచులు రంగుల ముగ్గులతో గొప్పగా జరుపుకుంటారని తెలిపారు. అబ్బాయిలంతా గాలిపటాలతో వేడుకలు చేసుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఘనంగా కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని యాదవ్ పాల్గొని చిన్నారులకు పతంగులు పంచారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ పండుగపూట రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. చిన్నప్పుడు అందరం కలిసి పతంగుల పండుగ సంతోషంగా జరుపుకునేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు పండుగ వచ్చిన సందడి కనిపించడం లేదన్నారు. విదేశీ కల్చర్‌ వచ్చేసిందని, మన సంస్కృతిని ఇప్పటి పిల్లలకు తెలిసేలా చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మన పండుగలను కొనసాగించే పరంపరను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. పతంగుల పండుగను రెండు రోజులపాటు జరుపుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News