Monday, December 23, 2024

ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం సంతోషదాయకం

- Advertisement -
- Advertisement -
సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్ : ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజా షాతోసహా మరో 152 మంది పెట్టిన ఉపా కేసును ఎత్తివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సిఎం కెసిఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఉపా చట్టాన్ని దేశవ్యాపితంగా ఎత్తివేయడానికి ప్రజాతంత్ర వాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరేవారు, ప్రజాతంత్ర పాలనను అందించాలనుకునే పాలకులు ఈ ఉపా చట్టాన్ని ఎత్తివేయడానికి కృషి చేయాల్సిన అవసరం వుందని, ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. దేశ ద్రోహం కేసు చట్టాన్ని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. నేషనల్ ఇన్విస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్‌ఐఎ) కూడా వేధింపులకు నిరుపయోగంగా ఉన్న చట్టాలను ఉపయోగిస్తున్నారన్నారు. ఈ సెక్షన్లు చట్టపరంగా ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కివేయడానికి, వారిని భయభ్రాంతానికి గురిచేయడానికి పోలీసు యంత్రాం గం ఉపయోగిస్తున్నారని, కొన్ని కేసులు ప్రభుత్వానికి కూడా తెలియకుండా పెడుతున్నారన్నారు.

నాపైన కూడా తాడా కేసులు పెట్టారు
1987లో తాను మండల అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సాధారణంగా ఒక పార్టీకి మరో పార్టీకి జరిగే ఘర్షణలో నాపైన కూడా ఈనాడు ఉపాగా పిలువ బడే తాడా కేసు పెట్టారని, అనాడు ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు జరిపి తాడా సెక్షన్‌ను ఎత్తివేసిన తరువాతే బెయిల్ రావడం జరిగిందన్నారు. తనలాంటి వారిపై కూడా టెర్రరిస్టులు కేసులు పెట్టడం వలన ఈ చట్టాన్ని ఎ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్ధం అవుతుందన్నారు. ఇది ప్రయోజనకరం కాదని, వ్యవస్థకు చెడు చేసే సెక్షన్లను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News