Saturday, November 23, 2024

ప్రగతిభవన్‌లో శుభకృత్ ఉగాది వేడుకలు

- Advertisement -
- Advertisement -

రవీంద్రభారతిలో కవి సమ్మేళనం

CS Somesh kumar review on job of vacancies

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2వ తేదీన ప్రగతిభవన్‌లోని జనహితలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన అధ్యక్షత బిఆర్‌కెఆర్ భవన్‌లో శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతిభవన్‌లోని జనహితలో ఏప్రిల్ రెండో తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని అన్నారు.

కార్యక్రమంలో వేద పండితుల ఆశీర్వచనం అనంతరం బాచుపల్లి సంతోష్‌కుమార్ శర్మచే పంచాంగ పఠనం ఉంటుందని తెలిపారు. వేద పండితులకు ఉగాది పురస్కారాలు అందజేసిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ సందేశం ఉంటుందని అన్నారు. సాయంత్రం 6,30 గంటలకు రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తాయని తెలిపారు.

ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, అర్వింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అడిషనల్ డిజి అనిల్‌కుమార్, జలమండలి ఎండి దానకిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News