Wednesday, January 22, 2025

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ  అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. 

క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి జరుగుతుందని, ఆయన అక్టోబర్ నుంచి సింహం లాగా పని చేస్తారని చిలూకూరి శ్రీనివాస మూర్తి తెలిపారు. ప్రధాని మంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజయోగం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని వివరించారు. అధికార పార్టీ కొత్త చట్టాలను తీసుకరావడంతో పాటు సుప్రీం కోర్టు అనుహ్య మార్పులు చోటుచేసుకుంటాయని శ్రీనివాస మూర్తి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News