Saturday, November 23, 2024

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో హాక్‌దర్శక్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశంలోని సూక్ష్మ, MSME వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడం కోసం భారతదేశపు ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా ఉన్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఉజ్జీవన్ SFB), సామాజిక, ఆర్థిక సమ్మేళన సంస్థగా ఉన్న హక్‌దర్శక్ (HQ) సంయుక్తంగా పనిచేయడానికి సిద్ధమయ్యాయి. సూక్ష్మ, MSME వ్యవస్థాపకుల మధ్య పరిజ్ఞాన వేర్పాటును తగ్గించడం కోసం ఉజ్జీవన్ SFB, HQ కలసి ఒక ప్రత్యేక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం అభివృద్ధి చేశాయి. ఈ కార్యక్రమం ద్వారా, రానున్న మూడేళ్లలో సుమారు 15,000 మంది వద్దకు చేరుకోవాలని ఈ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.

సమాచార సహిత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి, నష్టాలు తగ్గించడానికి అవసరమైన పరిజ్ఞానం, సాధనాలు అందించడం ద్వారా, లక్షిత వినియోగదారులను సన్నద్ధం చేయడమే ఈ భాగస్వామ్యపు ప్రాథమిక లక్ష్యంగా ఉంటోంది. చిట్టచివరి వినియోగదారుడి అవసరాలను కూడా గుర్తించే హాక్‌దర్శక్ సాంకేతిక-మద్దతు నమూనా ఉపయోగించి, ఈ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ, సంక్షేమ కార్యక్రమాలకు యాక్సెస్‌ అందించబడుతుంది. హాక్‌దర్శక్‌లు అనే శిక్షణ పొందిన కమ్యూనిటీ ఏజెంట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ సంక్షేమ కార్యక్రమాలను అన్వేషించడం, వాటి కోసం దరఖాస్తు చేయడంలో పౌరులకు సహాయపడడం కోసం హాక్‌దర్శక్ వారి HQ యాప్ రూపొందించబడింది.

MSMEల మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశపు MSME రంగం అనేది దేశపు ఆర్థికాభివృద్ధికి అత్యంత ముఖ్యమైనది. దేశపు GDPలో ఇది సుమారుగా 30% వాటాను అందిస్తోంది, సుమారు 1.1 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది; కాబట్టి, వారందరికీ సాధికారత అందించడం అత్యంత కీలకం. ఆర్థిక సమ్మేళనం, స్థితిస్థాపకత కలిగిన సమాజాన్ని ప్రోత్సహించడమనే ఆర్‌బిఐ విస్తృత లక్ష్య సాధన కోసం కూడా ఈ భాగస్వామ్యం తెరమీదకు వచ్చింది.

ఈ పరిశ్రమలోని చాలా మంది వ్యవస్థాపకులకు ఆర్థిక నిర్వహణ, నష్టాలు తగ్గించడం, ఆర్థిక వనరులు పెంచడంలో సహాయం అవసరం. ఉజ్జీవన్ SFB ద్వారా గుర్తించబడిన భాగస్వాముల్లో ఈ అవసరం గుర్తించడం కోసం ఒక సమగ్ర ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన కంటెంట్‌ మీద వ్యక్తిగత శిక్షణ, స్కీమ్ గుర్తింపు కోసం HQ యాప్‌ను ప్రత్యక్షంగా బహిర్గతం చేయడం, నిరంతర నైపుణ్యాభివృద్ధి లాంటివి ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. పరస్పరత అంశాలు, దృశ్యాల సహాయంతో అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌ల విభాగాలు, క్రమబద్ధీకరించిన ప్రయోజనాలకు సంబంధించిన నిజ-సమయ డేటాను పర్యవేక్షించడం ద్వారా, ఈ ప్రయత్నం కొనసాగుతుంది.

హాక్‌దర్శక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనికేత్ దోగర్ మాట్లాడుతూ.. “ఇదొక భారీ భాగస్వామ్యం. ఉజ్జీవన్ SFBతో కలసి ఒక భారీ స్థాయి ప్రభావం సృష్టించేందుకు మాకు ఇదొక అవకాశంగా ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించడమనే భారతదేశపు ప్రయత్నంలో ఈ భాగస్వామ్యం ఒక కీలకమైన అడుగు కాగలదు. సేవలు లభించని, తక్కువ సేవలు అందుకునే విభాగాలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో, MSMEలకు వినూత్న పరిష్కారాలు అందించడంలో ఉజ్జీవన్ SFB నిబద్ధత, నైపుణ్యం అనేవి హాక్‌దర్శక్ ప్రాజెక్ట్ విజయానికి కీలకం కాగలవు. ఈ అవకాశం లభించినందుకు మేము సంతోషిస్తున్నాము. మా ప్రభావాన్ని 10 రెట్లు పెంచడంలో ఇది మమ్మల్ని అనుమతిస్తుంది. అట్టడుగు స్థాయి వ్యవస్థాపకులకు సైతం సాధికారతను అందిచాలనే, 2030 నాటికి 100 మిలియన్ల మంది పౌరులకు సామాజిక భద్రత, ఆర్థిక మద్దతు అందించాలనే మా దార్శనికతకు ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంటుంది” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD, CEO ఇట్టిరా డేవిస్ మాట్లాడుతూ.. “మా వినియోగదారుల విషయంలో మా నిబద్ధత అనేది బ్యాంకింగ్, ఆర్థిక సేవలు అందించడం కంటే మరింత పైస్థాయికి విస్తరించింది. సూక్ష్మ, MSME వ్యవస్థాపకులకు ఆర్థిక పరిజ్ఞానం, వనరులు అందించడం ద్వారా, వ్యాపారం, వ్యక్తిగత ఫైనాన్స్ అనే సంక్లిష్టతల మధ్య నుండి మరింత ప్రభావవంతంగా ముందుకు సాగడంలో మేము వారికి సహాయపడగలమని మేము విశ్వసిస్తున్నాము. హాక్‌దర్శక్ నైపుణ్యం, సాంకేతిక వేదిక అనేది దేశవ్యాప్తంగా ఉన్న MSMEలను చేరుకోవడంలో, వారికి సహాయం అందించడంలో కీలకంగా ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాల కోసం ఆర్థిక అందుబాటు, శ్రేయస్సును ప్రోత్సహించడమనే మా లక్ష్యాన్ని మా ఈ ప్రయత్నం బలోపేతం చేస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News