Thursday, January 23, 2025

గిరిజన మహిళను వేధించడం దారుణం

- Advertisement -
- Advertisement -

విద్యానగర్: గిరిజన మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఎల్‌బినగర్ పోలీసులను శిక్షించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ రాష్ట్ర ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేశా రు. గిరిజన మహిళ నుంచి లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసి, తిరిగి ఆమెను లాకప్ డెత్ చేయాలని ప్రయత్నించడం అత్యంత దారుణమన్నారు. దళిత బహుజన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణ స్వరూప్ మట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలన్నారు.

గిరిజన మహిళను హింసించడం అం టే మానవ హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళను రాత్రి వేళ స్టేషన్ లో ఉంచడమే కాకుండ కొట్టి ఆమె నుంచి డబ్బులు లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ ఘటనపైన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మ హిళా కమిషన్లు స్పందించక పోవడాన్ని అయన తప్పు పట్టారు. చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్న పోలీసులను పదవుల నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఈ కేసు నిర్వీర్యం కాకుండా తెలంగాణ హై కోర్టు చొరవ చూపి స్పందించాలని, దళితుల జీవించే హక్కును కాపాదాలని కృష్ణస్వరూప్ విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర నాయకులు బీరం సతీష్ కుమార్, దేవుసూరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News