- Advertisement -
న్యూఢిల్లీ : నిందితుల నుంచి తీరని మానసిక చిత్రవధ అనుభవించడం వల్లనే అఖిల భారతీయ అఖారా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడ్డారని సిబిఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. విడిచిపెట్టిన శిష్యుడు ఆనంద్‌గిరి, పూజారి ఆధ్యప్రసాద్ తివారీ, ఆయన కుమారుడు సందీప్ తివారీ తీరని మానసిక చిత్రవధ కలుగ చేశారని, దీనివల్లనే సమాజం దృష్టిలో పరువు పోయిందని, తీరని అవమానంతో మహంత కుంగి పోయారని సిబిఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. మహంత తనకు తాను ఆత్మహత్య చేసుకోక ముందు రికార్డు చేసిన వీడియోను సిబిఐ స్వాధీనం చేసుకుంది. తాను ఒకామెతో అభ్యంతరకర స్థితిలో ఉన్నట్టు ఎడిట్ చేసిన వీడియోను ఆనందగిరి విడుదల చేయడానికి సిద్ధమయ్యాడని మహంత్ చెప్పడం ఆ వీడియోలో రికార్డయింది. ఈ ఛార్జిషీట్‌ను సిబిఐ ఈనెల 20 న దాఖలు చేసింది.
- Advertisement -