Thursday, January 23, 2025

మోడీని ప్రశ్నించిన అమెరికా జర్నలిస్టుకు వేధింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోడీ ని ప్రశ్నించిన వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్‌కు భారతీయుల నుంచి ఆన్‌లైన్ వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులను వైట్‌హౌస్ ఖండించింది. వేధింపుల గురించి తమకు నివేదికలు అందినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు. భారత్‌లో ఉన్న ప్రజాస్వామ్యంపై మోడీని రిపోర్టర్ సిద్ధిక్ ప్రశ్నించారు.

దీనికి మోడీ బదులిస్తూ భారత్‌లో ఎలాంటి వివక్ష లేదని వివరించారు. అప్పటి నుంచి సబ్రినా సిద్ధిక్‌కు ఆన్‌లైన్‌లో వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. ఆ రిపోర్టర్ ముస్లిం మతస్థురాలని, ఆన్‌లైన్‌లో వేధింపుల గురించి తమకు తెలుసని , వీటిని ఖండిస్తున్నట్టు వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో సబ్రినా తన ట్విటర్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. టీమిండియా టీషర్టు వేసుకుని తన తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటో పెట్టారు. తన తండ్రి భారత్ లోనే పుట్టినట్టు ఆమె తన ట్వీట్‌లో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News