Wednesday, January 22, 2025

న్యూడ్ వీడియో కాల్‌తో ప్రభుత్వ ఉద్యోగికి వేధింపులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః న్యూడ్ వీడియో కాల్‌తో ప్రభుత్వ ఉద్యోగిని వేధించిన సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి అందమైన యువతి వీడియో కాల్ చేసింది. కొంత కాలం నుంచి ఇద్దరు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. దీనిని యువతి రికార్డు చేసింది.

అప్పటి నుంచి యువతి వెనుక ఉన్న ముఠా రంగంలోకి దిగింది, తమకు డబ్బులు ఇవ్వకుంటే న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. వీరి బెదిరింపులకు భయపడిన బాధితుడు వారికి రూ.5లక్షలు ఇచ్చాడు. అయినా కూడా నిందితులు బాధితుడిని విడిచి పెట్టకుండా మళ్లీ డబ్బులు అడుగుతున్నారు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైం ఎసిపి ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News