Thursday, January 23, 2025

సోషల్ మీడియాలో వేధింపులు…విద్యార్థి బలవర్మరణం

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో యువకుడి వేధింపులు ఎక్కువ అవడంతో విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పోచంపల్లి మండలంలోని జిబ్లాక్ పల్లిలో చోటు చేసుకుంది. విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పునూతల కావ్య చౌటుప్పల్ ట్రినిటీ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతుంది.

కూతురి కోసం స్మార్ట్ ఫోన్ కోనివ్వడంతో అదే ప్రాణాలను తీసింది. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగా మృతురాలు ఆక్సెప్ట్ చేసింది. దీంతో ఆ యువకుడు ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ వేధించసాగాడు.

ఈ క్రమంలో ఇంటికి రమ్మని వేధించగా ఈ విషయాన్ని కావ్య సోదరుడు నరేష్‌తో చెప్పగా పలు మార్లు శివమణిని మందలించాడు. అయినప్పటికీ శివమణి ఫోన్ చాటింగ్ ద్వారా వేధిస్తూ ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల సమక్షంలో యువకుడిని హెచ్చరించారు. కాగా మనస్తాపానికి గురైన కావ్య ఇదివరకే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

అయినా కూడా వేధింపులు ఆగకపోవడంతో తన వల్ల కుటుంబం పరువు పోయిందని మానసికంగా బాధపడింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం లెటర్ రాసి మధ్యాహ్నం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. స్థానిక ఎస్సై సైదిరెడ్డి శవాన్ని పంచనామా చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News