Thursday, January 23, 2025

ఆఖరి ఫీజుల కోసం విద్యార్ధులకు వేధింపులు

- Advertisement -
- Advertisement -

వార్షిక పరీక్షలకు ఆలస్యంగా అనుమతి ఇస్తున్న ప్రైవేటు సంస్దలు
తోటి విద్యార్థుల ముందు సూటిపోటి మాటలతో ఇబ్బందులు
అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు
కరోనా నష్టాలు భర్తీ చేసుకునేందుకు స్కూళ్ల నిర్వహకుల ఎత్తులు

Fees Hikes
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ప్రైవేటు విద్యాసంస్దలు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తుండటంతో ఆఖరి టర్మ్ ఫీజుల కోసం విద్యార్ధులను వేధింపులకు గురిచేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి చిన్నారులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తూ పూర్తి స్దాయిలో ట్యూషన్ ఫీజులు చెల్లించిన వారినే పరీక్ష గదిలో పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. మొదటి రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు రాయించిన యాజమాన్యాలు రెండోరోజు ఫీజులు చెల్లించిన వారిని ఆరగంట తరువాత పరీక్ష హాల్‌లోకి పంపించారు. తల్లిదండ్రులకు పోన్ చేసి విద్యార్థులతో మాట్లాడిస్తూ తోటి విద్యార్ధుల వద్ద మేము తలదించుకుంటున్నామని సమాధానం చెప్పిస్తున్నారు.

దీంతో తప్పనిసరి పరిస్దితుల్లో తల్లిదండ్రులు అప్పులు చేసి పూర్తిగా బకాయిలు చెల్లిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మీస్కూళ్లకు చిన్నారులను పంపించమని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వేధింపులు చేసి సంపాదన ముఠా కట్టుకున్న పాఠశాలలు మూత పడక తప్పదని శాపనార్దాలు పెడుతున్నారు. కరోనా ప్రభావంతో ఆర్దిక ఇబ్బందులు పడుతున్న జలగాల పీడించడం సరికాదంటున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లో ఇంగ్లీషు విద్య ప్రవేశపెడుతుండటంతో కార్పొరేట్ బడులకు ఆదరణ తగ్గుతుందని మరోవైపు విద్యార్ధిసంఘాలు అంటున్నాయి. ఇటీవల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేటు యాజమాన్యాల ఫీజులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 1545 ప్రైవేటు స్కూళ్లుండగా వాటిలో 7.10లక్షలమంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చాలామంది ఫీజుల వేధింపులకు వార్షిక పరీక్షలకు హాజరు కావాలంటే భయపడుతున్నారు. తోటి విద్యార్ధుల అందరి ముందు ఫీజు చెల్లించలేదని, పక్కకు నిలబెట్టడం, పరీక్షకు ఆలస్యంగా పంపడంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు స్దానికంగా ఉండే మండల విద్యాదికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసి తాము ఏమి చేయలేమని, ప్రభుత్వ బడులు ఉండగా ప్రైవేటుకు ఎందుకు పంపిస్తున్నారని ఎదురు సమాధానం చెప్పి పంపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే సంస్దలకు ముక్కుతాడు వేయాలని విద్యార్దిసంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News