Monday, December 23, 2024

ప్రేమించకున్నా, చెప్పినట్టు వినకున్నా వేధింపులు

- Advertisement -
- Advertisement -

స్నేహితులుగా పరిచయం అవుతారు
ఛాటింగ్, ఫొటోలు తీసుకున్న తర్వాత మొదలుపెడతారు
ప్రేమించకున్నా, చెప్పినట్టు వినకున్నా వేధింపులు
మార్ఫింగ్ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్న నిందితులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః ముందు స్నేహితుడిగా పరిచయం అవుతారు, తర్వాత ఛాటింగ్ చేస్తారు, సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని వేధింపులకు దిగుతారు. సోషల్ మీడియా ఖాతాలను అస్త్రంగా చేసుకుని పలువురు నిందితులు యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు మంచిగానే ఉంటున్న నిందితులు విభేదాలు రావడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయి వేధింపులకు దిగుతున్నారు. నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేసి బాధితుల ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు దిగుతున్నారు. కొందరు నిందితులు ఏకంగా ఫోర్న్ సైట్లలో వారి ఫోటోలు పెట్టి కింద ఫోన్ నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయాల్సిందిగా పెడుతున్నారు.

దీంతో చాలామంది వెబ సైట్ల నుంచి ఫొటోలు తీసివేయించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో బాధితురాలు తనకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో తరచూ మాట్లాడేది. కొద్ది రోజుల తర్వాత తాను ప్రేమిస్తున్నానని చెప్పడంతో యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్య ఫొటోలను ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను ఓపెన్ చేసి పెడుతున్నాడు. వెంటనే తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విషయం తెలియడంతో బాధితురాలు అవాక్కయింది.

అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న యువకుడు అందులోనే పనిచేస్తున్న లెక్చరర్‌తో సన్నిహితంగా మెలిగాడు. వివాహిత అయిన బాధితురాలితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్‌మేయిల్ చేయడంతో వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో ఉంటున్న వివాహిత తన ఫొటోలు పోర్న్ సైట్ లో ఉండడంతో షాక్ తింది. ఆరా తీయగా తను చుదువుకున్నప్పుడు ఓ యువకుడితో సన్నిహితంగా ఉంది. ఆ సమయంలో తీసుకున్న ఫొటోలను యువకుడు పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశాడు. బాధితురాలికి వివాహం కావడంతో భర్త, పిల్లలతో ఆస్ట్రేలియాలో ఉంటోంది. వెంటనే ఇండియాకు వచ్చి హైకోర్టులో పిటిషన్ వేసింది . ఆ వెబ్‌సైట్ల నుంచి తన ఫొటోలు తొలగించాలని కోర్టును కోరింది. రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరుగుతున్నా కూడా యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండడంలేదు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించిన మెసేజ్‌లకు స్పందించి బాధితులుగా మారుతున్నారు.

సోషల్ మీడియానే అస్త్రం…
చాలామంది బాధితులు సోషల్ మీడియా వల్లే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. అపరిచితులతో స్నేహం చేయవద్దని పోలీసులు చెబుతున్నా యువతులు వినడం లేదు. ఎక్కువ కేసులు తమకు తెలిసిన వారి నుంచి వస్తున్నాయి. కొందు నిందితులు తమతో చదువుతున్న వారినే వేధింపులకు గురిచేస్తున్నారు. వివాహం చేసుకునేందుకు నిరకరించిందని, ప్రేమించడానికి నిరాకరించదని కక్ష పెంచుకుని వేధింపులకు దిగుతున్నారు.

తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వేధింపులకు గురిచేస్తే నకిలీ ఖాతాలను ఓపెన్ చేసి అసభ్య మెసేజ్‌లు, మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్నారు. కొందరు ఏకంగా యువతుల పరువు తీయాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా పంపించి వారి పరువు తీసేందుకు యత్నం చేస్తున్నారు. కొందరు నిందితులు బాధితుల భర్తలకు ఫొటోలు పంపిస్తున్నారు. దీంతో చాలా వివాహాలు మధ్యలో ఆగిపోయాయి. నిందితులు స్నేహం పేరుతో అమాయకులను కాటు వేస్తున్నారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో పట్టుబడమని పోకిరీలు భావిస్తున్నా, అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి నిందితులను పోలీసులు కటకటాల్లోకి పంపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News