టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంత కూల్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. ఆట ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా.. ఆయన ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయతీరాలకు చేరుస్తాడు. అలాంటి ధోనీకి ఒక వ్యక్తిపై కోపం వచ్చిందట. దాంతో ఆయన గత 10 సంవత్సరాలుగా ఆ వ్యక్తితో మాట్లడటం లేదట. ఆ వ్యక్తి మరెవరో కాదు. స్పిన్ దిగ్గజం హర్బజన్ సింగ్. భారత జట్టులో ఈ ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచులు ఆడారు. అంతే కాక, ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) జట్టులో ఆడారు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య మాటలు నిలిచిపోయాయట. ఈ విషయాన్ని హర్బజన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి.. అందరికి షాక్ ఇచ్చాడు. ‘నేను, ధోనీ మాట్లాడుకోవడం లేదు. సిఎస్‌కె తరఫున ఆడినప్పుడు కూడా కేవలం మైదానంలో మాట్లాడుకునే వాళ్లం. అంతకు మించి ఏం లేదు. ఇప్పటికే దాదాపు 10 ఏళ్లు అయింది. కానీ కారణం ఏంటో నాకు తెలియదు’ అని అన్నారు. కానీ, ఈ వ్యాఖ్యలపై ధోనీ ఇంకా స్పందించలేదు.
తాజాగా వీరిద్దరు ఒకే చోట కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియాలో ధోనీ, హర్బజన్ పక్కపక్కనే ఉన్నప్పటికి.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం మనం గమనించవచ్చు. ఈ వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన అభిమాని.. ధోనీని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో, భజ్జీని షార్క్ ఇండియా మాజీ జడ్జ్ అష్నీర్ గ్రోవర్‌తో పోల్చాడు. సల్మాన్ ఖాన్‌తో తనకు సరైన సంబంధాలు లేవు అంటూ అష్నీర్ గ్రోవర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. మరి ధోని, హర్బజన్‌ల మధ్య గొడవకు అసలైన కారణం ఏదైనప్పటికి.. వాళ్లు మళ్లీ కలుసుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు.