Thursday, January 23, 2025

ఆసీస్ ఆటగాళ్లపై ట్రోలింగ్ వద్దు: హర్భజన్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాపై కొంతమంది అభిమానులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఆసీస్ క్రికెటర్లను, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌పై కొంతమంది నెటిజన్లు అనుచిత కామెంట్స్ చేశారు. దీనికి వినీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా వినీ రామన్‌కు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు.

ఆటలో గెలుపోటములు సహాజమన్నారు. ఓటమిని స్పోర్టీవ్‌గా తీసుకోవాలని సూచించాడు. అయితే కొంతమంది అభిమానులు ప్రత్యర్థి టీమ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఏమాత్రం సరికాదన్నాడు. ఇలాంటి కామెంట్స్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని కోరాడు. ఫైనల్లో మనకంటే మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆస్ట్రేలియా విజేతగా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేశాడు. కొంత మంది అభిమానులు చేసే విమర్శలు దేశ పరువును దెబ్బ తీస్తుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News