Thursday, January 23, 2025

ఆ సెంచరీ వెనుక కఠోర శ్రమ ఉంది

- Advertisement -
- Advertisement -

ముంబై : విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మపై మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శర్మ చేసిన విధ్వంసకర సెంచరీపై ప్రశంసలు కురిపించాడు. ఆ సెంచరీ వెనుక ఎంత కష్టం దాగుందో అందుకు సంబంధించిన ఓ వీడియోను మెంటార్ యువి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో యువి మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీ చేసిన అభిషేక్‌శర్మకు అభినందనలు. ఇలాంటి శతకాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా’ అని తెలిపాడు. అయితే యువి విడుదల చేసిన వీడియోలో అభిషేక్ జిమ్‌లో తీవ్రంగా శ్రమించాడు. యువి దగ్గరుండి అభిషేక్‌కు ట్రైనింగ్ ఇస్తూ కనిపించాడు. శర్మ కఠోరమైన సాధన చేయించాడు. కాగా, అభిషేక్ శర్మ యువి దగ్గర రెండేళ్ల పాటు శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఈ పించ్ హిట్టర్‌కు యువి మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ప్రదర్శనతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అభిషేక్ శర్మ.. తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లో డక్ అవుట్‌గా వెనుదిరిగిన శర్మ రెండో టి20లో బ్యాట్ ఝలిపించాడు. దీంతో రికారుడ సెంచరీ నమోదు చేశాడు ఈ యువ బ్యాటర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News