Wednesday, January 22, 2025

కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 77 లక్షల మంది బిజెపికి ఓటేసి మద్దతుగా నిలిచారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బిజెపి బలోపేతం కోసం కార్యకర్తల కృషి ఎప్పటికీ మరువలేనిదని, ప్రతీ బూత్‌కు కార్యకర్త తిరిగి తన కోసం పని చేశారని ప్రశంసించారు. నాగోల్‌లో బిజెపి సభ్యత్వం నమోదుపై మోర్చాల సెల్స్ సంయుక్త కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు. పైసలు ఇచ్చి బిజెపికి ఓటేయాలని కార్యకర్తలు ఎప్పుడు అడగలేదని స్పష్టం చేశారు. రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు మెంబర్ షిప్ చేయించారని, కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని, రైతు పండించే పంటలకు మోడీ మద్దతు ధర పెంచారని బండి ప్రశంసించారు. ఎస్‌సి, ఎస్‌టి యువతను ప్రారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మూను బిజెపి రాష్ట్రపతి రాష్ట్రపతిని చేసిందన్నారు. ఇద్దరు ఎంపిలున్న పార్టీ వరసగా మూడో సారి అధికారంలోకి వచ్చిందన్నారు. జనతా పార్టీ లేకుంటే కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసేదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర పదాధికారులు, మోర్చా, సెల్స్ రాష్ట్ర, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News