Wednesday, January 22, 2025

హార్దిక్ చూపే ప్రశాంతత ధోనిని గుర్తుకు తెస్తుంది: గవాస్కర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యను మాజీ భారత స్కిప్పర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. పాండ్యలో కనిపించే ప్రశాంతత దిగ్గజ మహేంద్ర సింగ్ ధోని తీరును గుర్తుకు తెస్తుందన్నారు. పాండ్య నేతృత్వంలో టైటాన్స్ జట్టు క్వాలిఫయర్ 2లో ఐదు సార్లు ఛాంపియన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టును 62 పరుగుల తేడాతో ఓడించింది. ఇక నాలుగు సార్లు విజేతగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనున్నది.

‘హార్దిక్ మహేందర్ సింగ్ ధోనిని ఓపెన్‌గానే మెచ్చుకుంటుంటాడు. వారు ఇద్దరు టాస్‌కు వెళ్లినప్పుడు స్నేహితుల్లా నవ్వులు చిందించనున్నారు’ అని గవాస్కర్ ‘స్టార్ స్పోర్ట్’ తో అన్నారు. ‘కానీ మ్యాచ్ విషయానికి కొస్తే మాత్రం విషయం వేరేలా ఉండనున్నది. తాను ఎంత వేగంగా నేరుకున్నాడన్నది హార్దిక్ పాండ్య చూయించే అవకాశం ఉంది’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ టైటాన్స్ జట్టు విజయానికి కోచ్ ఆశీష్ నెహ్రా(73) కూడా తోడ్పడ్డారని గవాస్కర్ అన్నారు.

గుజరాత్ జట్టు క్వాలిఫైయర్1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడారు. వారు ధోనీ సేనకు ఆదివారం ఫైనల్స్‌లో తమ సత్తా ఏమిటో చూపనున్నారని గవాస్కర్ తెలిపారు. ‘గుజరాత్ టైటాన్స్ ఎల్లప్పుడూ టాప్ క్లాస్ టీమే. వారు తల్లకిందులు చేశారు. వారు 20 పాయింట్లు సాధించారు. అది చెన్నై సూపర్ కింగ్స్ కంటే మూడు పాయింట్లు ఎక్కువ. ఇదే చెబుతోంది గుజరాత్ జట్టు సత్తా ఏమిటో. లీగ్ స్టేజీలోల గుజరాత్ జట్టు ఎలా ఆదిపత్యం చెలాయించిందో ఈ పాయింట్లే చెబుతున్నాయి. వారు ఫైనల్‌కు చేరుకోవడం కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. వారు ఛాంపియన్స్ క్రికెట్ ఆట ఆడారు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ‘ ఇప్పుడు వారందుకే ఫైనల్‌లో ఉన్నారు. అసలైన నువ్వా, నేనా అన్న పోటీ వారిలో చేతిలోనే ఉందని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా తెలుసు’ అని ముగించారు గవాస్కర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News