Friday, November 15, 2024

భారత్ టి20 సారథిగా హార్దిక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శ్రీలంక, భారత్ మధ్య 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ జనవరి 3నుంచి ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో టీమిండియా ఆడే తొలి పొట్టి సిరీస్‌కు కెప్టెన్‌గా పాండ్య వ్యవహరించనున్నాడని స్టార్‌స్పోర్ట్ సూచించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత జట్టు విజయవంతంగా క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్ విజయంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతున్న కొత్త సవాల్‌కు సిద్ధం కానుంది. శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ టి20లతో ప్రారంభమవనుండగా లంకేయులపై తలపడే జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే భారతజట్టుకు టి20కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్యను నియమించనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అభిమానుల అంచనాకు స్టార్‌స్పోర్ట్ టి20సిరీస్‌పై ప్రసారం చేస్తున్న ప్రోమో అభిమానుల అంచనాకు ఊతమిస్తోంది. టి20 ప్రపంచకప్ 2022లో భారతజట్టు ఎలిమినేషన్ తర్వాత ఫార్మాట్ కెప్టెన్సీపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. రోహిత్‌శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు హర్దిక్‌కు పూర్తిస్థాయిలో అందజేస్తే జట్టును విజయపథంలో గెలుపుబాటలో నిలుపుతాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా టి20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 3 మంగళవారం 6గంటలకు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చేతి బొటనవేలికి గాయమైన హిట్‌మ్యాన్ అనంతరం బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగే పొట్టి సిరీస్‌కు రోహిత్ దూరం కానున్నాడు. టి20 సిరీస్ తర్వాత జరిగే వన్డే సిరీస్ జనవరి 12నుంచి ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News