Sunday, December 22, 2024

ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్ పాండ్యా?

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2024 ఎడిషన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో చేరబోతున్నట్లు భారీగా ప్రచారం జరుగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ డిసెంబర్ 19న జరిగే ఆటగాళ్ల వేలానికి ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ని రూ. 15 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పాండ్యా విషయంపై సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నా.. గుజరాత్, ముంబైల్లో మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. పాండ్యా మళ్లీ ముంబయిలో చేరితే.. శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు సమాచారం.

హార్దిక్ తన IPL ప్రయాణాన్ని 2015లో ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. 2021లో జట్టును విడిచిపెట్టాడు. 2022 మెగా వేలానికి ముందు అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్‌తో అతను సంతకం చేసాడు. తరువాత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ అహ్మదాబాద్ ఆధారిత ఫ్రాంచైజీని 2022లో ఐపీఎల్ టైటిల్‌కు మార్గనిర్దేశం చేశాడు. 2023 ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News