Monday, December 23, 2024

హార్దిక్ కెప్టెన్సీ 100శాతం భేష్!

- Advertisement -
- Advertisement -

మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్

There Is No Clarity In Current Indian Team Says Mohammad Kaif

ముంబై: గుజరాత్ జట్టు సారధి హార్ధిక్ పాండ్య తన బాధ్యతలకు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని, అతని కెప్టెన్పీకి నూరుకు నూరు శాతం మార్కులివ్వాల్సిందేనని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. తొలుత గుజరాత్ ఫ్రాంచైజీ పాండ్యకు సారధ్య బాధ్యతలు అప్పజెప్పినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యానని, కానీ హార్ధిక్ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని జట్టును అగ్ర స్థానంలో నిలబెట్టాడని కైఫ్ ప్రశంసించాడు. అంతేకాదు ఆ జట్టులో ఆటగాళ్లందరూ చాలా బాగా రాణించారన్నాడు. కాగా, ఐపిఎల్ ప్రసుత్త సీజన్‌లో గుజరాత్ జట్టు అద్భుతంగా రాణించింది. వరుస విజయాలతో ప్లేఆఫ్‌లో మొదటి స్థానం దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన హర్ధిక్‌సేన కేవలం నాలుగింటిలోనే ఓడి, 10 మ్యాచ్‌లలో గెలుపొందింది. దీంతో 20 సాయింట్లతో ఆగ్ర స్థానంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News